Wednesday, 4 November 2026

*కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కోటేష్ గౌడ్ పై కేసు నమోదు*

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి): గ్రామపంచాయతీ కార్యదర్శి పై దాడి చేసిన కేసులు శంషాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కోటేష్ గౌడ్ పై కేసు నమోదైన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
శంషాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శశిధర్ రెడ్డి బుధవారం గ్రామపంచాయతీ పరిధిలోని గురుకుల పాఠశాల వద్ద వరద నీరును తొలగించడానికి జెసిబి తో పనులు చేస్తుంటే పాలమాకుల గ్రామానికి చెందిన శంషాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కోటేష్ గౌడ్ గ్రామ కార్యదర్శి పై బూతులు తిడుతూ దాడి చేశారని ఫిర్యాదు రావడంతో విచారించి కోటేష్ గౌడ్ పై ఐపీసీ 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఫోటో రైటప్ : గ్రామ కార్యదర్శిపై దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కోటేష్ గౌడ్.