*సీఎం సహాయనిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం*

ఇటిక్యాల ఆగస్టు 19 (జనంసాక్షి ) ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తముగా వైద్య ఆరోగ్య ఖర్చుల నిమిత్తం  సీఎం సహాయ నిధి చెక్కులు అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం అబ్రహం అన్నారు. శుక్రవారం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే ఆగ్రహం పంపిణీ చేశారు. ఇటిక్యాల మండల పరిధిలోని శాసనూల్ గ్రామానికి చెందిన సువర్ణ గత కొంతకాలంగా అనారోగ్యముతో హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటుంది. ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వము నుండి  మంజూరు అయిన  1,50,000 రూపాయల సీఎం సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే అబ్రహం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు రాముడు, తిమ్మాపురం నారాయణ నాయుడు, చంద్రన్నతదితరులు పాల్గొన్నారు.