కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షునిగా భాద్రపు శంకర్
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా రొంపి కుంట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు భద్రపు శంకర్ నియమి తులయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు ఆదివారం నియామక పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకంతో మండల ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు కు శంకర్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సైతం శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.