కాచాపూర్ లో పెన్షన్ పత్రాల పంపిణీ
జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి
శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 23 శంకరపట్నం మండల పరిధిలోని కాచాపూర్ గ్రామంలో శుక్రవారం ఆసరా పెన్షన్ పత్రాల పంపిణీ శంకరా పట్నం మండల జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి కాచాపూర్ గ్రామపంచాయతీలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకులు ఎవరు పట్టించుకోలేదు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ తో నిరుపేద కుటుంబాలకు ఎంతో అండగా ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పులికోట రమేష్ సర్పంచ్ కొండ్ర రాజయ్య ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు