ఏకాగ్రతతో పరీక్ష రాసి అర్హత సాధించాలి
మీ కష్టాన్ని వృధా కానివ్వకండి
జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ..
రేపు జరిగే పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరి పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య.. శుభాశీస్సులు తెలిపారు…ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా భారీగా పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టడం జరిగింది. రేపు జరగనున్న కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షను ఏకాగ్రతతో రాసి మంచి మార్కులతో అర్హత ఉద్యోగమనే కలను నెరవేర్చుకోవడానికి మీరు పడిన కష్టాన్ని వృధా పోనివ్వకండి…ప్రతీ ఒక్కరు ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసి మీ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. మీరు విజేతలుగా నిలవాలని కోరుకుంటూ… ” అల్ ది బెస్ట్




