జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించిన హెచ్ఎం.
ఎర్గట్ల ఆగస్టు 27 (జనంసాక్షి )నిజాంబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో శనివారం ప్రధానోపాధ్యాయులు మునీరుద్దీన్ సమక్షంలో విద్యార్థుల క్రమశిక్షణ, విద్యార్థుల ప్రగతి, మధ్యాహ్న భోజనం, హాస్టల్ విద్యార్థులకు అందించే భోజనం, వివిధ విషయాలపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపేందర్ రెడ్డి,జెడ్ పి టి సి గుల్లే రాజేశ్వర్,సర్పంచ్ లావణ్య గంగాధర్, ఎంపిటిసి మధుసూదన్, విద్యా కమిటీ చైర్మన్ ఇబ్రహీంపట్నం నరేష్,గ్రామ కమిటీ అధ్యక్షులు బద్దం ప్రభాకర్, వార్డు సభ్యులు చిన్నయ్య,ఉపాధ్యాయులు జి.జి.గిరిధర్, హాస్టల్ వార్డెన్ రాము, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.