హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటనను నిరసిస్తూ భాజపా నేతలు నిరసనకు దిగారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ యశోద, ఓమ్నీ ఆసుపత్రుల్లో క్షతగాత్రులను పరామర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో చైతన్యపురి వద్ద ప్రధాని కాన్వాయ్‌ను భాజపా నేతలు అడ్డుకునేందుకు యత్నించారు. అయితే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు భాజపా నేతలను అరెస్టు చేసి సమీప పోలీసుస్టేషన్‌కు తరలించారు.




