కాపు మున్నూరు కాపు అభినయ ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న బండి సంజయ్

కంటోన్మెంట్ జనం సాక్షి 06 సికింద్రాబాద్ రాజరాజేశ్వరి గార్డెన్ లో ఏర్పాటు చేసిన కాపు,మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సమ్మేళనం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పాల్గొన్నారు.
అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కావడం సంతోషం,ఇన్నాళ్లు నన్ను ప్రోత్సహించి రాజకీయంగా ఎదుగుదలకు తోడ్పడిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణలో ఏ కులం వారు కూడా సంతోషంగా లేరు,స్వార్థ కుట్ర రాజకీయాల కోసం కులాలను అడ్డం పెట్టుకుని నాయకులు ఎక్కువగా ఉన్నారు.
కులంతో రాజకీయం చేయడం రాజకీయ నాయకుల లక్షణం కాదు,ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలతో కలిసి నడవడం సంతోషం కలిగించింది,హిందూ సమాజాన్ని కాపాడుతూ ధర్మ పరిరక్షణకై కులాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేశాను.పేదలను ఆదుకునే విషయంలో కాపు, మున్నూరు కాపులు ముందుండి అందరికీ ఆదర్శంగా నిలవాలి,కుల సంఘాల పేరుతో రాజకీయం మంచిది కాదు మన ముఖ్యమంత్రి కేసీఆర్ కుల సంఘాలను కూడా విడదీసి రాజకీయం చేస్తున్నారు.కులాలను,యునియన్లను, ఉద్యోగస్తులను, కార్మికులను చీల్చి పాలిస్తున్నాడు,ఏ కులమైనా అందులో ఉన్న పేద ప్రజల గురించి ఆలోచించి వారిని ఏ విధంగా ఆదుకోవాలని వాటిపై దృష్టి సారించాలి.. కనీస వసతులు మౌలిక సదుపాయాలు ఇల్లు లేక ఎంతోమంది పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
కుల సంఘాలు ఆర్భాటాలకు పోకుండా సరైన పద్ధతిలో పనిచేసి పేదలను ఆదుకోవాలి.ప్రశ్నించే ధైర్యం ఉన్నవారే మున్నూరు కాపులు..ఆత్మగౌరవ పేరుతో భవనాలు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం ఇతర పార్టీలకు అలవాటుగా మారింది.
అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ సాక్షిగా మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పడం సిగ్గుచేటు,ఎంఐఎం,బీఆర్ఎస్ లు ఒక్కటే అని మరోసారి స్పష్టం అయింది, తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలు రాజకీయాల్లోకి రావాలి,కుటుంబ పాలన అంతం కావాలిబండి సంజయ్ అన్నారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్ ని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు,మున్నూరు కాపు ఆర్గనైజర్ సెక్రెటరీ,జూబ్లీహిల్స్ బిజెపి కాంటెస్ట్ ఎమ్మెల్యే కాండేట్ ఆలపాటిలక్ష్మీనారాయణ,కార్యవర్గ సభ్యులు, మరియు రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు బొక్క వేణుగోపాల్,చంద్రయ్య, ఎం.శ్రీనివాస్, ఎర్రం మహేష్, కరుణాకర్,
లక్ష్మణ, కుమార్, మాణిక్, ప్రభు కొండ దేవయ్య, కార్పొరేటర్ కొంతమంది దీపకా నరేష్, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎడ్ల లక్ష్మీనారాయణ,మరియు కాపు మున్నూరు కాపు పెద్దలు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాజావార్తలు