రంగంపేటలో డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభించిన ఎంపీపీ మంజుల. సర్పంచ్ బండి సుజాత

జనం సాక్షి/ కొల్చారం రోగ నిర్ధారణలో పరీక్షలు ముఖ్యమని… రంగంపేటలో డయాగ్నోసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని కొల్చారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కొరబోయిన మంజుల కాశీనాథ్, రంగంపేట సర్పంచ్ బండి సుజాత రమేష్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేటలో భవాని డయాగ్నోసిస్ సెంటర్ ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం ఈ రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ మండల యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ రావు సోదరుడు మధుసూదన్ రావు ను అభినందించారు. ఈ కార్యక్రమంలోయువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు, రంగంపేట్ సర్పంచ్ సుజాత రమేష్, కోనాపూర్ సర్పంచ్ రమేష్,సొసైటీ వైస్ చైర్మన్ మోతుకు మల్లేశం,సోమ నర్సింలు, రవిందర్ గౌడ్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ చంద్ర శేఖర్ రెడ్డి, వంజరి మల్లేశం, కోనాపూర్ బండి రాజు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు