హైదరాబాద్,జులై24(జనంసాక్షి): షాద్‌నగర్‌లో కారు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అంతరాష్ట్ర దోపిడీ దొంగల ముఠా ఒకటి డవ్మిూ వెపన్‌ను చూపించి కారును ఎత్తుకెళ్లింది. ఈ కేసును ఛేదించిన పోలీసులు మహారాష్ట్రకు చెందిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. థానే రైల్వేస్టేషన్ వద్ద రూ.1000కి సిగరేట్ ముట్టించే డవ్మిూ వెపన్‌ను కొనుగోలు చేసిన నిందితులు
దానితోనే యజమానిని బెదిరించి కారును తీసుకెళ్లారు. నిందితుల వద్ద నుంచి రూ.2.89 లక్షలు, 35 తులాల బంగారం, డవ్మిూ వెపన్, కారును స్వాధీనం చేసుకున్నట్టు సీపీ సజ్జనార్ తెలిపారు.




