హైదరాబాద్,నవంబర్30 (జనం సాక్షి): కార్తీక పౌర్ణమిని గ్రేటర్ బరిలో ఉన్న అభ్యర్థులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం పరిసమాప్తం కావడంతో ఆ తర్వాత సమయాన్ని అభ్యర్థులు పౌర్ణమి భక్తులను లక్ష్యంగా చేసుకున్నారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. భక్తులకు పూజ సామగ్రిని అందజేశారు. నగరంలోని పలు ఆలయాలను పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. తమ డివిజన్లో గల ఆలయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కొంతమంది అభ్యర్థులు ఆలయాల వద్ద తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను అందించారు.




