హైదరాబాద్,నవంబర్30 (జనం సాక్షి): కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి బంజారాహిల్స్‌లోని శివాలయానికి వెళ్లిన కవిత శివునికి అభిషేకం చేశారు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది కూడా ఆ శివుడి దయవల్ల ఇక్కడ అభిషేకం చేశానని చెప్పారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరంలోని శివాలయాలు, పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. పెద్దఎత్తున కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
శైవాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు




