కార్పొరేటర్ సునీల్ పై మండిపడ్డ వరంగల్ బిజెపి శ్రేణులు

ఖిలా వరంగల్, జూలై26(జనంసాక్షి)
బిజెపి నుండి బీఫామ్ తీసుకొని గెలిచి టిఆర్ఎస్ పార్టీ మారడానికి సిగ్గుండాలని కార్పొరేటర్ సునీల్ పై వరంగల్ బిజెపి శ్రేణులు మండిపడ్డారు. బుధవారం వరంగల్ చౌరస్తాలో ఓ హోటల్లో ఎర్పాటు చేసినా మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ గురించి మాట్లాడే హక్కు సునీల్ బ్రదర్స్ కి లేదని మండిపడ్డారు. కూరగాయల మార్కెట్లో రోడ్డు సైడ్ కూరగాయలు అమ్ముకునే నిన్ను అవకాశం కల్పించి బిజెపి కార్పొరేటర్ గా గెలిపించుకొని బిజెపి అధ్యక్షునిగా అవకాశం ఇస్తే, తల్లి రొమ్ము పాలు తాగి తల్లికి మోసం చేసినట్టు బిజెపి పార్టీని వదిలి బిఅర్ఎస్ లోకి పోవడం సిగ్గుచేటని అన్నారు. దమ్ముంటే నీ డివిజన్లో అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధం.. మీరు రండి, టైం మీరు ఫిక్స్ చేసిన సరే, మమ్మల్ని ఫిక్స్ చెయ్యమన్నా సరే అంటూ సవాలు విసిరారు

తాజావార్తలు