కార్యకర్తల కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటాం

చౌడాపూర్,సెప్టెంబర్ 27( జనం సాక్షి): చౌడపూర్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త భారతమ్మ మరణించిన విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ తెరాస రాష్ట్ర యువ నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.5 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి శంకర్,డిప్యూటీ సర్పంచ్ శివకుమార్,వార్డు మెంబర్ అశోక్,గౌస్,రాజు,యాదయ్య,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల నరసింహులు,కృష్ణయ్య,రమేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.