కాలేజీలో వైద్య పరీక్షలు

జనం సాక్షి కథలాపూర్
కథలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేంద్ర కుమార్ వైద్య పరీక్ష లు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేంద్ర కుమార్ మాట్లాడుతూ సుమారు 200 విద్యార్థులకు వైద్య పరీక్ష నిర్వహించమని కంటి చూపు పరీక్ష నిర్వహించి అనంతరం అవగాహన కల్పించామని తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్యం కాపాడుకోవాలని సీజనల్ వ్యాధులు నుండి రక్షించుకోవాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌస్ ర్ రెహమాన్ అధ్యాపకులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.