నూతన బస్ షెల్టర్ ను ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

జనం సాక్షి, నర్సంపేట
మండలంలోని పాత మొగ్ధుంపురం గ్రామంలో
నూతన బస్ షెల్టర్ ను ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.నర్సంపేట నియోజకవర్గం చెన్నరావుపేట- నర్సంపేట ప్రధాన రహదారిపై పాత ముగ్దుంపురం గ్రామం వద్ద _”వేములపల్లి మొగిలి మెమోరియల్ ఫౌండేషన్”_ వారి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన _బస్ షెల్టర్_ ను రాష్ట్ర పౌరసరఫరాల, బీసీ సంక్షేమ శాఖ  మంత్రి గంగుల కమలాకర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఉద్యమకారుడు, యువకుడు, పెద్ది నర్సంపేట ఎమ్మెల్యేగా ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమని, నిర్మాణo చేపట్టిన ఫౌండేషన్ చైర్మన్ వేములపల్లి రాజుకు మంత్రి, ఎమ్మెల్యే అభినందనలు అని,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 284 బిసి రెసిడెన్షియల్ పాఠశాలలను, జూనియర్ & డిగ్రీ కళాశాలలను స్థాపించడం జరిగిందనీ,వీటి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 92 వేల మంది పేద విద్యార్థులకు రెసిడెన్షియల్ విద్యను నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం.బిసి విద్యార్థుల విదేశీ విద్య కోసం ఓవర్సీస్ స్కాలర్ స్కిప్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతుంది.ఉద్యమకారుడు, యువకుడు, మేమందరం ముద్దుగా పిలుచుకునే పెద్దన్న నర్సంపేట ఎమ్మెల్యేగా ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టం. వారి చొరవతో అదనంగా మరొక బిసి గురుకులాన్ని మీ నియోజకవర్గానికి ఇవ్వడం జరిగిందనీ,బిసిల సంక్షేమం కోసం, కుల వృత్తుల నైపుణ్యాభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రతి ఏటా నిధులను కేటాయిస్తుందనీ, భవిష్యత్తులో నర్సంపేట నియోజకవర్గ విద్యాభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియచేశారు.ఈ బస్ షెల్టర్ ను నిర్మాణాన్ని చేపట్టిన ఫౌండేషన్ చైర్మన్ వేములపల్లి రాజు కి మంత్రి గంగుల, ఎమ్మెల్యే పెద్ది లు అభినందనలు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో మండల & పట్టణ పార్టీ అధ్యక్షులు, జెడ్పిటిసి, ఎంపిపి, వైస్ ఎంపిపి, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, పార్టీ ముఖ్య నాయకులు, క్లస్టర్ భాద్యులు, ఫౌండేషన్ అధినేత వేములపల్లి రాజు, భాద్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు, పాల్గొన్నారు.