కాళీ స్థలాలలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి మండల స్పెషల్ ఆఫీసర్ బాలరాజు
గంగారం సెప్టెంబర్ 10 (జనం సాక్షి)
గంగారం మండల కేంద్రంలోనీ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల హాస్టల్ ప్రాంగణంలో ఖాళీగా ఉన్న స్థలంలో గంగారం మండల స్పెషల్ ఆఫీసర్ బాలరాజ్ విద్యార్థులతో కలిసి మొక్కలను నాటడం జరిగింది. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ బాలరాజు మాట్లాడుతూ మన చుట్టూ పరిసరాలు పచ్చదనంగా మరియు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటుకోవాలని మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలని వివరించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాస్, పిడి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు సుధాకర్, నరసయ్య, సంధ్య, పిల్లల తల్లిదండ్రులు మరియు గ్రామ సిబ్బంది పాల్గొన్నారు