Wednesday, 4 November 2026

కాశీబుగ్గ డిప్యూటీ కమిషనర్ గా కృష్ణారెడ్డి

ఖిలా వరంగల్, ఆగస్ట్08(జనంసాక్షి);
కాశీబుగ్గ డిప్యూటీ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కృష్ణారెడ్డి మంగళవారం ప్రధాన కార్యాలయం లో నగర మేయర్ గుండు సుధారాణి నీ మర్యాద పూర్వకం గా కలిసి పూల మొక్కను అందజేశారు.కాగా ఇక్కడ డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన శ్రీనివాస రెడ్డి సదాశివ పేట మునిసిపల్ కమిషనర్ గా బదిలీ కాగా అక్కడ పనిచేస్తున్న కృష్ణారెడ్డి కాశీబుగ్గ డిప్యూటీ కమిషనర్ గా నియామకం అయ్యారు. ఈ సందర్భం గా మేయర్ డిప్యూటీ కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు