Wednesday, 4 November 2026

కిడ్నాపైన బాలుడు క్షేమం

ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు

కిడ్నాపర్ల అరెస్ట్‌

హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో ఏడేళ్ల బాలుడు ఆయుష్‌(7) అపహరణ కేసును హైదరాబాద్‌ ఉత్తర మండల పోలీసులు చేధించారు. ఇద్దరు మహిళలను అరెస్ట్‌ చేసి బాలుడిని సురక్షితంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు మహిళలు మహబూబ్‌నగర్‌కు చెందిన ప్రొఫెషనల్‌ కిడ్నాపర్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సోమవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు తల్లితో పాటు వచ్చిన బాలుడికి ఇద్దరు మహిళలు బిస్కెట్లు కొనిస్తామని మాయమాటలు చెప్పి అపహరించారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు స్థానిక గోపాలపురం పోలీసుల సహాయంతో మూడు బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. మంగళవారం అల్వాల్‌ పరిధిలోని బొల్లారంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విూడియా ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు.