కిడ్నీ అమ్మడానికి అనుమతి ఇవ్వాలంటూ వికలాంగుడు తహశీల్దారుకు వినతి
కుల్కచర్ల, సెప్టెంబర్ 3(జనం సాక్షి):
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని సాల్వీడ్ గ్రామానికి చెందిన ఎల్కిచర్ల వెంకటయ్య తను వికలాంగుడు కుటుంబ పోషణ భారమై
అప్పులు చేసి ఆర్థిక పరీస్థితి బాగలేక, అప్పులు కట్టలేక, తను వికలాంగుడు కావడంతో
ఏమి పని చేయలేక,అనేక సమస్యలతో సతమతమవుతు ఇక చేసేదేమీ లేక ఒక నిర్ణయానికి వచ్చి తన కిడ్నీని అమ్మడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ దళిత వికలాంగుడు తహసీల్దార్ రమేష్ కుమార్ కు వినతి పత్రం శనివారం అందజేశారు.ఈ సందర్భంగా స్థానికులు మహిపాల్ మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం ఇలాంటి నిజమైన దళిత నిరుపేదలకు అందేవిధంగా కృషి చేయాలని తెలిపారు.అందేవిధంగా ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే ప్రభుత్వం నుండి లబ్ది పొందేందుకు కృషి చేయాలని కోరారు.తహశీల్దార్ రమేష్ కుమార్ మాట్లాడుతూ..అతని కుటుంబ పరిస్థితులను పరిశీలించి కలెక్టర్ కు నివేదిక పంపి అతని ఆదుకునే ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జాట్ జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు గాదె మహిపాల్ ముదిరాజ్, బురకొండ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.