కిసాన్ క్రెడిట్ కార్డు మంజూరు చేసి రుణాలు అందించాలి .

 

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ఫోటో రైటప్: సమావేశంలో మాట్లాడుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి ..

 

నర్సంపేట సెప్టెంబర్ 27( జనం సాక్షి)

 

సీజన్లో రైతాంగానికి కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేసి రుణాలు అందించి ఆదుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే అన్నారు
మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గోపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
ఎలాంటి వ్యవసాయ భూమి లేని రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను ఎలాంటి జాప్యం లేకుండా మంజూరు చేసి సకాలంలో రుణాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్నారు.
-అదేవిధంగా ఎస్సీ, ఎస్ టి ,బి సి
కార్పొరేషన్లకు సంబంధించిన సబ్సిడీ రుణాలను బ్యాంకు సిబిల్ స్కోర్ కు సంబంధం లేకుండా సకాలంలో అందించేలా సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ అడిషనల్ కలెక్టర్ , నాబార్డు జనరల్ మేనేజర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, మెప్మా అధికారులు, కార్పొరేషన్ల అధికారులు, జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులు, హాజరయ్యారు.