ఏనుగుల నాంపల్లి సెప్టెంబర్ 27( జనం సాక్షి )మునుగోడు ఉప ఎన్నికలలో బిజెపి పార్టీ గెలవడం ఖాయం అని మాజీ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మునుగోడు ప్రాంతం అభివృద్ధి కావాలంటే బిజెపి పార్టీ గెలవాలని అన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో మునుగోడు ప్రాంతం అభివృద్ధి కోసం ఎన్నిసార్లు మాట్లాడిన సీఎం కేసీఆర్ ఈ ప్రాంతానికి నిధులు కేటాయించ లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి టిఆర్ఎస్ ప్రభుత్వ ని ఎదిరించ లేనని, ఇది బిజెపి పార్టీతోనే సాధ్యమని. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బిజెపి పార్టీలో చేరారనిన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లు, అభివృద్ధి పనులు, గొల్ల కుర్మలకు మూడో విడత గొర్రెల పంపిణీ, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించారని న్నారు. ఈ సంవత్సరంలో మధ్యంతర ఎన్నికలు వస్తే బిజెపి పార్టీ గెలవడం ఖాయమనిన్నారు. ఈ కార్యక్రమం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్ యాదవ్, రితీష్ రాథోడ్, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బొడ్డుపల్లి శేఖర్, జిల్లా నాయకుడు రెడ్ల రఘుపతి రెడ్డి, పూల వెంకటయ్య, బీజేవైఎం జిల్లా కోశాధికారి పానుగంటి మహేష్, పోగుల వెంకటరెడ్డి, దాచేపల్లి నరసింహ, దూదిమెట్ల సత్యం, సర్పంచులు మల్గిరెడ్డి చంద్రారెడ్డి, చందు యాదవ్, సంజీవ రెడ్డి, సురేందర్ నాయక్, బిజెపి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సింగారం గిరి, శ్రీశైలం, వెంకట్ రెడ్డి,సతీష్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనె రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి




