హైదరాబాద్,ఆగస్ట్15(జనం సాక్షి): వీధి కుక్కను చంపిన కేసులో ఓ వ్యక్తిపై సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బోయిన్‌పల్లి, నందమూరినగర్ ప్రాంతానికి చెందిన రామారావు (45) ఫర్నిచర్ వ్యాపారి. మంగళవారం సాయంత్రం తన ఇంటి సవిూపంలో ఓ వీధి కుక్కను చంపి…శవాన్ని మేడ్చల్ రహదారిపై నుంచి తరలిస్తున్నాడు. అదే సమయంలో పీపుల్స్ ఫర్ యానిమల్ సంస్థ సభ్యుడు అదిత్యవిజయ్ దీనిని గమనించి… కుక్కను తరలిస్తున్న ఫొటో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకుపోలీసులు రామారావుపై కేసు నమోదు చేశారు.
———–




