కుటుంబ కలహాలతో వ్యక్తి మృతి….
భార్య కాపురానికి రాలేదని మనస్థాపంతో మృతిచెందిన వ్యక్తి..
చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని అజ్జమర్రి గ్రామంలో చోటుచేసుకుంది మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరణ ప్రకారం గ్రామానికి చెందిన ముండ్రాతి సతీష్ వయసు 25 సంవత్సరాలు గల వ్యక్తికి గత ఆరు సంవత్సరాల క్రితం మెదక్ జిల్లా, మండలం, లోని గడ్మట్ పల్లి గ్రామానికి చెందిన యాదమ్మతో వివాహం జరిగింది వీరికి ఒక కూతురు 4సం.లు గలది కావున వీరికి గత మూడు సంవత్సరాలుగా కుటుంబ కలహాలతో ఇరువురు దూరంగా ఉంటున్నారు మృతుడి భార్య యాదమ్మ కూతురుతో కలిసి వారి స్వగ్రామమైన గడ్మట్ పల్లిలో ని తల్లి దండ్రుల వద్ద నివాసం ఉంటున్నారు మృతుడు సతీష్ పలుమార్లు కుటుంబ సభ్యులతో కలిసి భార్యను తీసుకురావడానికి వెళ్లగా ఆమె భర్త వెంట రావడానికి నిరాకరించిగా అతను మనస్థాపానికి లోనై మంగళవారం నాడు తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలియజేశారు మృతుడి సమాచారం తెలుసుకున్న స్థానిక ఏఎస్ఐ మిస్బవోద్దీన్ పోలీస్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని పంచనామ చేసి పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పరుశురాం రెడ్డి ఉప సర్పంచ్ పోచయ్య ఎంపిటిసి మల్లయ్య ఏఎస్ఐ మిస్బవోద్దిన్ పోలీస్ సిబ్బంది ఉన్నారు