కుమ్మరి సంఘం భద్రాద్రి జిల్లా అధ్యక్షురాలుగా ఆమెడ రేణుక

టేకులపల్లి, సెప్టెంబర్ 21( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుమ్మరి సంఘం అధ్యక్షురాలుగా టేకులపల్లి మండలానికి చెందిన ఆ మెడ రేణుకను రాష్ట్ర సంఘం ఏకగ్రీవంగా నియమించారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ అధ్యక్షులతోపాటు నాయకులకు తనపై నమ్మకం ఉంచి జిల్లా బాధ్యతను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కుమ్మరి సంఘం సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.