టీపీసీసీలో చారులత రాథోడ్ కు సభ్యులుగా చోటు.
జనం సాక్షి ఉట్నూర్.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు కార్యవర్గా సమావేశం గురువారం హైదరాబాద్లోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా శ్రీరాజ్ మోహన్ ఉన్నితన్ శ్రిరాజ్ బాగెల్ హాజరయ్యారు. నూతన పిసిసి ప్రతినిధుల కార్యవర్గ ఎన్నికకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టిపిసిసి ఏఐసీసీ కోర్ కమిటీ సభ్యులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్ బాబు మాజీ ఎంపీ వి హనుమంతరావు తీర్మానాన్ని బలపరిచి సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు డిసిసి మహిళా అధ్యక్షురాలు ఉట్నూర్ మండల జడ్పిటిసి సభ్యురాలైన చారులత రాథోడ్ కు నూతనంగా ఏర్పాటు చేసిన పిసిసి కార్యవర్గంలో ఖానాపూర్ నియోజకవర్గం నుండి పిసిసి సభ్యులుగా ఏకగ్రీవంగా నియామకమయ్యారు. ఈ సందర్భంగా చారులత రాథోడ్ మాట్లాడుతూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి ఏఐసీసీ తనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా ఉంటూ పార్టీని బలోపేతనికి కృషి చేస్తామని అన్నారు.టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏఐసీసీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.