కురుమల హక్కుల సాధనకై పోరాడాలి
మోత్కూరు అక్టోబర్ 17 జనంసాక్షి : కురుమల ఐక్యత, సమస్యలు, హక్కుల సాధనకై పోరాడాలని కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొండె శ్రీకాంత్ కురుమ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని విజ్ఞాన్ ఒకేషనల్ కాలేజీ ప్రాంగణంలో ఆదివారం కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఇంఛార్జి గంగరి శ్రీనివాస్ కురుమ అధ్యక్షతన జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఎన్నుకున్నారు. నూతన జిల్లా అధ్యక్షులుగా మల్లెల శ్రీకాంత్ కురుమ, ప్రధాన కార్యదర్శి గా ర్యాకల శ్రీనివాస్ కురుమ, ఉపాధ్యక్షులు గా కోడూరు కొమురయ్య కురుమ, నోముల వెంకటేశ్వర్లు కురుమ, గౌరవాధ్యక్షులు గా జూకంటి అంజయ్య కురుమ, సలహాదారులుగా ఒగ్గు శివ కుమార్ కురుమ, బర్ల బిక్షం కురుమ, ప్రచార కార్యదర్శి గా బీర్ల రాజ శేఖర్ కురుమ, కోశాధికారి గా జూకంటి వీరేశం కురుమ, కార్యదర్శులు గా బాల్దే భాస్కర్ కురుమ, కర్రే చంద్ర శేకర్ కురుమ, కడారు విజయ్ కురుమ, దెందే యాదగిరి కురుమ, జమ్మి నరేష్ కురుమ, మోటే మహేష్ కురుమ, సహాయ కార్యదర్శులు దయ్యాల వెంకటేష్ కురుమ, ర్యాకల రాజ్ కుమార్ కురుమ, చిలుగురి శ్రీకాంత్ కురుమ, ఎక్కిరి సిద్ధులు కురుమ, కార్యవర్గ సభ్యులుగా కడకంచి శివ శంకర్, చీర నరేష్ కురుమ లతో కూడిన కమిటీి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో ఆర్డినేటర్ మిరియాల నవీన్ కురుమ, రాష్ట్ర కార్యదర్శి కొల్లు రమేష్ కురుమ,వివిధ మండలాల అధ్యక్షులు, జిల్లాలోని అన్నీ మండలాల నుండి సభ్యులు, కులస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Attachments area