కులము పేరుతో దూషించిన ఎస్సై స్రవంతి రెడ్డి పై అట్రాసిటీ కేసు పెట్టాలి.
– కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు
గొల్లపల్లి రజనీకాంత్
కురవి సెప్టెంబర్-15 (జనం సాక్షి న్యూస్)
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో 12- 9- 2022 రోజున ఎస్సై స్రవంతి రెడ్డి గ్రామ యువకులను మాదిగ నా కొడుకులారా అని సంబోధిస్తూ అహంకారంతో అనడం సరైనది కాదు అని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రజనీకాంత్ అన్నారు. ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగి కులం పేరుతో దూషించడం సిగ్గుచేటని,యువకులు తప్పు చేస్తే అరెస్టు చేయాలి కానీ, అహంకార భావంతో కులం పేరుతో దూషించటం హేయమైన చర్యని వెంటనే ఆ జిల్లా ఎస్పీ , జిల్లా కలెక్టర్ విచారణ జరిపించి ఆమెపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే విధుల నుండి బహిష్కరించాలని, లేనియెడల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ఉద్యమిస్తామని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రజనీకాంత్ అన్నారు.