Friday, 6 November 2026

కూరగాయల సాగుపై నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం

హైదరాబాద్  డిసెంబర్ 16 జనం సాక్షి

కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు వారి ఆధ్వర్యంలో కూరగాయల సాగుపై నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఎన్ రాజన్న, ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి మాట్లాడుతూ ప్రతి రైతు విధిగా పెరట్లో కూరగాయల సాగు చేపట్టి తద్వారా ఆరోగ్యకరమైన కూరగాయలను ఖర్చు లేకుండా పెంచుకోవచ్చని తెలిపినరు. ఆరోగ్యంగా ఉండాలి అంటే పీచు పదార్థాలు కావాలి, అవి కాయగూరలలో అధికంగా ఉంటాయి. డాక్టర్ సిహెచ్ సౌమ్య సేద్య విభాగ శాస్త్రవేత్త కూరగాయల సాగు వివరములను రైతులకు తెలియజేశారు రైతులందరూ కేవీకే లోని కూరగాయల క్షేత్రాన్ని సందర్శించి బెండ, సొర, బీర సాగును చూశారు. డాక్టర్ శశాంక్ మరియు డాక్టర్ సాయి కిరణ్ అజోల్లా యూనిట్, పెరటి కోళ్ల పెంపకం మరియు వాటి లాభాల గురించి వివరించారు.డాక్టర్ గణేష్ చేపల పెంపకం గురించి వివరించారు. ఈ సందర్భంగా రైతులు పాల్గొన్నారు.