బాబాపూర్ గ్రామంలో అక్రమ మడిగే నిర్మాణం పట్టించుకోని గ్రామపంచాయతీ అధికారులు భీమ్గల్(జనంసాక్షి):భీమ్గల్ నుండి కమ్మర్ పల్లికి వెళ్లే ప్రధాన రహదారి కి అనుకోని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మడిగేను నిర్మిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణం బాబాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుంది.పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం అన్ని రకాలుగా అనుమతులు తీసుకుని నిర్మాణం చేపట్టాలి.కానీ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం జరుగుతుంది. అక్రమ నిర్మాణం జరుగుతున్న గ్రామపంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.గత రెండు రోజుల ముందే ప్రారంభించిన ఈ నిర్మాణం ఆగమేఘాల మీద నిర్మిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా పంచాయతీ అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఈ అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని బాబాపూర్ గ్రామ ప్రజలు కోరుతున్నారు.
బాబాపూర్ గ్రామంలో అక్రమ మడిగే నిర్మాణం పట్టించుకోని గ్రామపంచాయతీ అధికారులు




