Tuesday, 3 November 2026

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించాలని గడపగడపకు ప్రచారం నిర్వహించిన : హస్తినాపురం డివిజన్ తెరాస అధ్యక్షులు ఆందోజు సత్యం చారి

ఎల్బీ నగర్( జనం సాక్షి  ) మునుగోడు ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ  కి  పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని  హస్తినాపురం డివిజన్ తెరాస అభ్యర్థులు ఆందోజు సత్యం చారి అన్నారు .  మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా మంగళవారం నాడు    ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి  ఆదేశాల మేరకు చౌటుప్పల మున్సిపాలిటీలోని 17, 18 వార్డులలో స్థానిక టిఆర్ఎస్ నాయకులతో కలిసి మునుగోడు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ    అందోజు   సత్యం చారి ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులతో కలిసి  గడపగడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో  శేషగిరిరావు  ,రోహిత్రెడ్డి  తదితరులు పాల్గొన్నారు