Wednesday, 4 November 2026

కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు డా.రాజన్న ప్రోగ్రాం కోఆర్డినేటర్ మరియూ శాస్త్ర వేత్తల బృందం గీసుగొండ మండలం గంగాదేవిపల్లిలోని గొర్రెల మందల్ని సందర్శించడం జరిగింది

అక్టోబర్ 13 (జనం సాక్షి)

ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు డా.రాజన్న ప్రోగ్రాం కోఆర్డినేటర్ మరియూ శాస్త్ర వేత్తల బృందం గీసుగొండ మండలం గంగాదేవిపల్లిలోని గొర్రెల మందల్ని సందర్శించడం జరిగింది. ఈ గొర్రెల మందల్లో చాలా గొర్లు కుంటుతూ కనబడుతున్నాయి అదే విధంగా వాటి గిట్టల్లో కూడా ఫుల్లు పడి ఉన్నాయి దీనిని సాధారణంగా ఫుట్ రాట్ వ్యాధి అని అంటాము ఈ ఫుట్ రాట్ వ్యాధి స్పిరోఫోరస్ నేక్రోఫోరస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా వలన వస్తుంది. ఇది వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు తడి నేలల్లో గొర్రెలను తీసుకొని పోయి మేపడం వలన అదే విధంగా చిత్తడి నేలల్లో ఎక్కువసేపు నిలబడిన కూడా ఈ బ్యాక్టీరియా గిట్టల మధ్యలోకి వెళ్లిపోయి వ్యాధిని కలగజేస్తుంది ఈ వ్యాధి సోకినటువంటి గొర్రెలు మందకు వెనుకబడి కుంటుతూ ఉంటాయి. ఈ కుంటడం మూలంగా వాటికి కావాల్సినటువంటి మేత అందక నీరసించి చనిపోతూ ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు ఈ కుంటే గొర్రెల్ని మందతో పాటు తీసుకొని పోకుండా వీటిని కొట్టాల్లోనే కట్టేసుకొని విడిగా మేత అందించినట్లయితే వాటి శరీర బరువు కోల్పోకుండా ఉంటాయి. అదేవిధంగా త్వరగా కోలుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇక ఈ వ్యాధి నివారణకు ముఖ్యంగా మనము స్టెప్టో పెన్సిలిన్ మందుల్ని వాడాల్సి ఉంటుంది అదేవిధంగా 1%
పొటాషియం పర్మంగనేట్
ద్రావణంలో కాలి గిట్టలు కడిగి, నొప్పి నివారణకు
మెలాక్సికాం లాంటి మందులని కూడా వాడాలి. ఇక ఎక్కువగా నీరసించి పోయినటువంటి ఆ మేకలు గాని గొర్లు గాని ఉన్నట్లయితే వాటికి గంజికానీ, జావకాచి,లేదా అంబలి గాని రోజుకు రెండుసార్లు తాగించాలి ఇక ఎక్కువగా
కుంటుతూ ఉన్నాయి అదేవిధంగా వర్షాలు ఆ చిత్తడి నెలలు ఎక్కువగా ఉన్నయనుకుంటే అనుకుంటే మనము 1% ఒక శాతం ఫార్మలిన్ ద్రావణాన్ని చిన్న ఒక పాత్రలో పోసుకొని దాంట్లో గొర్రెల్ని ఒక ఐదు నుంచి పది నిమిషాలు నిలబెట్టినట్లయితే గిట్టలు గట్టిపడి త్వరగా కోలుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ గొర్రెల మందల సందర్శనలో శాస్త్రవేత్తలు రవీందర్ , బి.ఎన్.రెడ్డి, ఆరుంజ్యోతి మరియు శ్యాంప్రసాదు పాల్గొన్నారు.