మా పల్లెర్ల పల్లెటూరును పట్టించుకోండి

రోడ్ల మరమ్మతులు తక్షణమే చేపట్టాలి విద్యార్థులు

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 13 (జనంసాక్షి) మండలంలోని 2వ పెద్ద గ్రామ పంచాయతీ అయిన పల్లెర్ల గ్రామంలో గతంలో సీసీ రోడ్లు వేశారు అక్కడక్కడా గుంతలు పడ్డాయి గ్రామ అధికారులు పాటించుకోవడం లేదు విద్యార్థులు బడికి వెళ్ళేటప్పుడు వాహనాలు వేగంగా వెళ్లడం ద్వారా విద్యార్థుల మీద పడుతున్నాయి ప్రజలకు రాకపోకలు ఈబంధిగా ఉన్నాయి కనీసం మట్టికూడా పొయ్యడం లేదు వానాకాలం వస్తే చాలు నీళ్ల బుడదాగా మారిపోతుంది పల్లెటూరిలో కనీసం మౌలిక సదుపాయాలు రోడ్లు కూడా సరిగ్గా లేవు రోడ్ల మరమ్మతులు తక్షణమే చేపట్టాలని విద్యార్థులు ప్రజలు కోరుతున్నారు