Thursday, 5 November 2026

కృష్ణపట్నం పోర్టుకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌: తీరంలో సీఆర్‌జెడ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తోందంటూ కృష్ణపట్నం పోర్టుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పోర్టు యాజమాన్యంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అలాగే అటవీ శాఖ, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలికి కూడా తాఖీదులు పంపింది.పోర్టు నిర్మాణంలో కోస్తా నియంత్రణ మండలి నిబంధనలను ఉల్లఘింస్తూ కొన్ని చేస్తూ శాశ్వత నిర్మాణాలు పొర్టు యాజమాన్యం చేపట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌పై  విచారణ చేపట్టిన హైకోర్టు ఈ  నోటిసులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *