పట్టాల సవరణతో లబ్దిదారుల్లో ఆనందం
హైదరాబాద్,జూలై5(జనం సాక్షి ): పట్టా భూములను లావణి పట్టాగా రికార్డుల్లో నమోదు చేసిన అధికారుల తప్పిదాన్ని ఆరేళ్ల తర్వాత ప్రభుత్వ ఆదేశాలతో తిరిగి సరిచేశారు. మంత్ంరి కెటిఆర్ ఆదేవాలతో పట్టాల సవరణ జరిగింది. నాగోలు రెవెన్యూ పరిధిలోని సర్వే నం. 102, 104 లలోని స్థలాలు పట్టా భూములు కాగా.. 2012లో నాటి ఉప్పల్ ఎమ్మార్వో లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు రికార్డుల్లో లావణి భూములుగా నమోదు చేశారు. దీంతో అప్పటి నుంచి సదరు సర్వే నంబర్లలోని సాయినగర్ 5, 6, 7 వీధులు, అనంతుల కాలనీ, స్నేహపురి కాలనీలోని కొంతభాగంలో భవన నిర్మాణాలకు అనుమతులు నిలిపేశారు. ఈ విషయంపై చేసిన వినతులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇటీవలనాగోలులో నిర్వహించిన మన నగరం కార్యక్రమంలో సమస్యను పరిష్కరిస్తామని ఆయన హావిూ ఇచ్చారు. వెంటనే రివ్యూ సమావేశం నిర్వహించి ఆ రెండు సర్వే నంబర్లను పట్టా భూములుగా మార్చాలని ఆదేశించారు. మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి తప్పును సవరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందికరంగా మారిన సమస్యపై దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు చేపట్టిన మంత్రి కేటీఆర్ నిర్ణయంపై నాగోలు కార్పొరేటర్ చెరుకు సంగీతప్రశాంత్గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.




