Tuesday, 3 November 2026

కెసిఆర్‌ ఎత్తుగడలతో చిత్తవుతున్న కాంగ్రెస్‌

ముందస్తు వ్యూహాల్లో ముందుకు కదలని యంత్రాంగం

ఎదురుదాడితో ఆత్మరక్షణలో పడ్డ నేతలు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు తథ్యం సిఎం అని కెసిఆర్‌ చెప్పకనే చెప్పారు. ఎన్నికల నినాదాం ఎలా ఇవ్వాలో కెసిఆర్‌ చేసి చూపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికల ప్రకటన లేకున్నా ప్రాచార ఘట్టానికి తెరలేపారు. భారీ బహిరంగ సభ ద్వారా ప్రజలను ఆవైపుగా ఆలోచించే లా చేశారు. ప్రలు కూడా ఎన్నికలు వస్తున్నాయనే భావిస్తున్నా విపక్షాలు మాత్రం ముందస్తు ఎన్నికలపై ఆత్మరక్షణలో పడ్డాయనే చెప్పాలి. ఎన్నికలపై ప్రతిపక్షాల నాయకులు ఇప్టపి వరకు చేస్తున్న ప్రకటనలు వారిలోని భయాన్ని ఎత్తి చూపాయి. ఐదేళ్లు పాలించమని ప్రజలు అధికారం ఇస్తే మధ్యలోనే కాడి వదిలేశారని చెప్పడం ద్వారా ఎన్నికలకు సిద్దంగా లేమన్న ఆందోళనలను ప్రజల ముందుకు తెచ్చారు. సై అంటూ సవాల్‌ విసరలేక పోయారు. తేల్చుకుంటాం అని అనలేక పోయారు. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షం ఓ రకంగా పలు రకాల ప్రకటనలతో అధికార పార్టీకి అవకాశం ఇచ్చినట్లు అయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయంగా వేసే అడుగులను పసిగట్టడంలో విఫలమయ్యారనే చెప్పాలి. కెసిఆర్‌ వేస్తున్న ప్రతి అడుగు వెనక రాజకీయ కోణం ఉందన్న విషయాన్‌ఇన ప్రతిపక్షాలు అంచనా వేయడంలో విఫల మయ్యాయి. ప్రధాన ప్రతిపక్షంగా ముందస్తు ఎన్నికలు వస్తే సై అనాల్సిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ప్రకటనలు పరిశీలిస్తే వారిలో ఆత్మవిశ్వాసం లోపించినట్టు కనిపిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనని ప్రకటిస్తూనే ముందస్తు ఎన్నికల అవసరం ఏమిటన్న ప్రశ్న సంధించడంతోనే వారిలో ఆత్మవిశ్వాసం లోపించినట్టు అనిపిస్తోంది. ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉంటే లాభపడేది తామే అని ఎన్నికలకు

తొందరపడాలి. కాంగ్రెస్‌ నాయకుల పరస్పర విరుద్ద ప్రకటనలను బట్టి చూస్తే వారు ఎన్నికలకు సిద్దంగా లేరన్న విషయం అధికార పక్షానికి కలసివచ్చేలా ఉంది. అందుకే కెటిఆర్‌ తదితరులు ఎదురుదాడికి దిగారు. దమ్ముంటే ఎన్నికలకు రండని సవాల్‌ చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన…షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరిగినా తామే గెలుస్తామన్న అతి విశ్వాసంలో నేతలు నిద్రతమత్తులో ఉన్నారు. ముందస్తుపై కెసిఆర్‌ వ్యూహం ఏమై ఉంటుందా అని తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారు. లోక్‌సభ,అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగితే, ప్రజలలో భారతీయ జనతాపార్టీకి ఉన్న వ్యతిరేకత తనకు నష్టం కలిగిస్తుంన్న భావనలో కెసిఆర్‌ ఉన్నారు. అలాగే ఒకేసారి ఎన్నికల వల్ల కాంగ్రెస్‌ పార్టీ లాభపడే అవకాశం ఉందన్న భావన కూడా ఉంది. అందుకే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వ్యూహరచన చేసి వడివడిగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్‌ నాయకులకు కూడా ఈ విషయం తెలుసు. అయితే ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పలేరు కనుక ముందస్తు ఎందుకు? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. రాజకీయాలలో కేసీఆర్‌ వేసే అడుగులను అంచనా వేసి తదనుగుణంగా ప్రతివ్యూహాలను రచించుకోవడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమవుతూ వస్తోంది. తెలంగాణను సాధించింది తానేనన్న నమ్మకం ప్రజలలో కలిగించడానికై హైదరాబాద్‌లో తనకు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేయవలసిందిగా పార్టీ శ్రేణులను ఆదేశించారు. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన కేసీఆర్‌కు అతి భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. దీంతో కెసిఆర్‌ బాగా లబ్దిపొందారు. అయితే పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించి తెలంగాణను సాధించుకొచ్చామని ప్రజలకు చెప్పలేకపోయారు. తెలంగాణ తెచ్చింది తామే కనుక అధికారం తమదేనని భ్రమించి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారే గానీ కేసీఆర్‌ ఎత్తుగడలను పసిగట్టలేక పోయారు. 2014 ఎన్నికలలో దాదాపు పది మంది కాంగ్రెస్‌ నాయకులు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడ్డారు. ఇదే అదనుగా భావించిన కేసీఆర్‌ తన సహజ ధోరణికి భిన్నంగా తెలంగాణవ్యాప్తంగా కాలికి బలపం కట్టుకుని తిరిగి పార్టీ తరఫున ప్రచారం చేసుకున్నారు. దీంతో ఎన్నికలలో ఆయన శ్రమ ఫలించింది. మళ్లీ ఇప్పుడు కేసీఆర్‌ తన రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న తన నిర్ణయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతూనే, అందుకు అవసరమైన ఏర్పాట్లు చకచకా చేసుకుంటూ పోతున్నారు.