సికింద్రాబాద్ (జనం సాక్షి ): డిప్యూటీ స్పీకర్ పద్మారావు పార్టీ మారుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కార్పొరేటర్ సామల హేమ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ వెన్నంటి నడిచిన ఉద్యమ నాయకుడు పద్మారావు అని ఆమె తెలిపారు. రాజకీయ పబ్బం గడుపుకోవడనికి ప్రతిపక్షాలు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేపిస్తున్నాయి అని ఆమె ధ్వజమెత్తారు . తన జీవితాన్ని తన కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి కట్టుబడి ఉంటామని చాలాసార్లు పద్మారావు ఈ సందర్భంగా గుర్తు చేశారు . సామజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని నాయకులకు పిలుపు ఇస్తున్నట్టు కార్పొరేటర్ సామల హేమ ఒక ప్రకటనలో తెలిపారు.
కెసిఆర్ ఆశయాల ప్రతి రూపమే డిప్యూటీ స్పీకర్ పద్మారావు …. కార్పొరేటర్ సామల హేమ




