కెసిఆర్ ను గద్దె దించడమే బిజెపి పార్టీ ప్రధాన లక్ష్యం…
బిజెపి రాష్ట్ర నాయకులు,మాజీ మంత్రి బాబు మోహన్
కేసముద్రం సెప్టెంబర్ 19 జనం సాక్షి /మండలంలోని అమీనాపురం గ్రామంలో ఆదివారం రోజున ప్రజా గోస- బీజేపీ భరోసా యాత్రలో భాగంగా బైక్ యాత్రను బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి సినీ నటులు బాబు మోహన్ జెండా ఊపి ప్రారంభించినారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ప్రజల గోస చూడలేకనే ఈ యాత్ర ప్రారంభించినట్లు తెలియజేస్తూ…ఇప్పటివరకు రెండు పర్యాయాలు కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు అన్యాయం జరిగిందంటూ నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,దళిత బంధు,ఉద్యోగ నోటిఫికేషన్లు ఇలాంటి మోసపూరిత హామీలు ఎన్నో ఇచ్చి నెరవేర్చకపోగా మళ్లీ తెరపైకి గిరిజన బంధు అమలు చేస్తామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు.ఇన్నేళ్లలో ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని ఉత్తి మాయమాటలేనని,కుటుంబ పాలన సాగిస్తూ లక్షల కోట్లు వెనుక వేసుకున్నారని ,వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించడమే తమ పార్టీ లక్ష్యమని,కేంద్రంలో మూడవసారి కూడా బిజెపి ప్రభుత్వమే వస్తుందని తెలియపరిచారు.ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జాటోత్ హుస్సేన్ నాయక్ ,జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచంద్ర రావు, వరంగల్ రూరల్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి,కేసముద్రం మండల అధ్యక్షులు పొదిలి నరసింహ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శులు వల్లభు వెంకటేశ్వర్లు,చిల్పూరి వెంకన్న,ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామడుగు వెంకటాచారి,జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఇందు భారతి ,జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు రాంబాబు నాయక్ ,ఉపాధ్యక్షులు బొట్టు రమేష్, జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు ఖాసీం,మండల అధికార ప్రతినిధి గాంతి వెంకటరెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి ధారావత్ శోభన్,ధారావత్ కిషోర్, జాటోత్ నరేష్,సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area