కె వి పి ఎస్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి గా తిప్పారపు సురేష్ ఎన్నిక

కరీంనగర్ ఆగస్ట్ 10. జనంసాక్షి

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం( కెవిపిఎస్ ) తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు సంగారెడ్డి జిల్లా లో 7,8,9,తేదీలలో జరిగాయి. ఈ మహాసభలకు ముప్పై జిల్లాల నుండి ఎంపిక చేయబడిన ఆరువందల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దేశంలో దళితులు ఎదురుకొంటున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వాల విధానాలు కేవీపీఎస్ నిర్వహించిన పోరాటాలు సమీక్షించడం జరిగింది.మూడవ రోజు రాష్ట్ర నూతన కమిటీ నీ ప్రతినిధులు ఎన్నుకున్నారు.పద్దెనిమిది మంది తో రాష్ట్ర కార్యవర్గం,డెబ్భై మందితో రాష్ట్ర కమిటీ నీ ఎన్నుకోవడం జరిగింది, రాష్ట్ర సహాయ కార్యదర్శి గా తిప్పారపు సురేష్ ,రాష్ట్ర కమిటీ సభ్యులు గా కొంపెళ్లి సాగర్ ను రాష్ట్ర కమిటీ లోకి ఎన్నిక కావడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తూన విధానాన్ని ప్రజలలోకి తీసుకోపోవలని.రాజకీయాలకు అతీతంగా దళిత బందు దళితులకు ఇవ్వాలని. కుల వివక్ష ను నిర్ములించాలని .దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని,భూమి లేని చోట ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఇవ్వాలని, బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని,దళిత క్రైస్తవులకు ఎస్సి హోదా కల్పించాలని,అసంఘటిత రంగ కార్మికులకు సాంఘిక భద్రత కల్పించాలని పలు తీర్మానాలు మహాసభ ఆమోదం తెలిపింది.