Wednesday, 4 November 2026

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ లో రీజినల్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్

కేంద్రీయ విద్యాలయ ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ప్రారంభించారు
జనం సాక్షి సంగారెడ్డి రూరల్
కేంద్రీయ  విద్యాలయ సంఘటన్ హైదరాబాద్ రీజినల్ క్రికెట్ టోర్నమెంట్ మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కేంద్రీయ విద్యాలయం లో రీజినల్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను  పాఠశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు క్రికెట్ క్రీడలను గురువారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ క్రీడా మైదానంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో హైదరాబాద్ రీజినల్ కేంద్రీయ విద్యాలయ అనుసంధాన క్రికెట్ అండర్ 17 టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు 25, 26, 27 వరకు క్రికెట్ క్రీడలు జరుగుతాయని అన్నారు కరోనా నేపథ్యంలో విద్యార్థులకు క్రీడలు నిర్వహించలేకపోయామని విద్యార్థులకు ఆసక్తి కనిపరిచే విధంగా క్రీడలను కొనసాగిస్తామని తెలిపారు కె.వి విద్యాలయాలు హైదరాబాద్ రీజినల్ లో 72 విద్యాలయాలు ఉన్నాయని అందులో 7
పికెట్. విజయవాడవిజయవాడ, ఒడిఎఫ్ మెదక్, బేగంపేట్, గోల్కొండ, నల్లగొండ, రాజమండ్రి కేంద్రీయ విద్యాలయ క్రికెట్ క్రీడాకారులకు  ఎంపిక చేసి క్రికెట్ క్రీడలను నిర్వహిస్తున్న తెలిపారు క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ కోచ్ ల తో క్రికెట్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు
హైదరాబాద్ రీజియన్ స్థాయి క్రికెట్ క్రీడలు నిర్వహిస్తున్నామని
 క్రీడల్లో గెలుపొందిన క్రికెట్ విన్నర్ విన్నర్ షీల్డ్ తో సత్కారిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నరసింహ రావు, పిటి, విద్యార్థులు ఉపాధ్యాయులు కోచులు తదితరులు పాల్గొన్నారు