ఎల్బీ నగర్ (జనం సాక్షి ) తెలంగాణలో కాషాయ జెండా ఎగర వేయాలని కేంద్రకేంద్ర పార్లమెంటు వ్యవహారాల శాఖ మాత్యులు ప్రహ్లాద్ జోషి అన్నారు .చేవెళ్ల పార్లమెంటు పార్టీ క్లస్టర్ ఇన్చార్జిగా విచ్చేసిన కేంద్ర పార్లమెంటు వ్యవహారాల శాఖ మాత్యులు ప్రహ్లాద్ జోషి ని బిజెపి రాష్ట్ర నేత ,మహేశ్వరం నియోజకవర్గం మాజీ సింగిల్విండో చైర్మన్ కొల న్ శంకర్ రెడ్డి కలవడం జరిగినది ఈ సందర్భంగా వారితో పార్టీ బలోపేతం సంస్థాగత నిర్మాణం పై చర్చించడం జరిగినది, ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు మాట్లాడుతూ తెలంగాణలో కాషాయ జెండా ఎగర వేయడమే ఎజెండా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పో రెడ్డి అర్జున్ రెడ్డి ఏనుగు ప్రభాకర్ రెడ్డి ఆధార్ ల మహేష్ కుమార్ ఇతర శ్రేణులు పాల్గొన్నారు
కేంద్ర పార్లమెంటు వ్యవహారాల శాఖ మాత్యులు ప్రహ్లాద్ జోషిని మర్యాదపూర్వకంగా కలిసిన :బీజేపీ రాష్ట్ర నాయకులు కొలను శంకర్ రెడ్డి




