Wednesday, 4 November 2026

కోటి మంది ఆడపడుచులకు బతుకమ్మ చీరలు.

  నెరడిగొండసెప్టెంబర్25(జనంసాక్షి):
సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ దసరా పండుగకు కోటి మంది ఆడపడుచులకు 350 కోట్లతో బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు అన్నారు.ఆదివారం రోజున బతుకమ్మ ఉత్సవాలనుపురస్కరించుకుని మండల కేంద్రములో బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు ముఖ్యఅతిథిగా హాజరయ్యి చీరలు పంపిణీ చేశారు,ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ బతుకు చిత్రమని మన అస్తిత్వంసాంప్రదాయలకు ప్రతికనే బతుకమ్మ పడుగని తెలంగాణ ఆడపడుచులకు పెద్దన్న కేసీఆర్ కానుకే బతుకమ్మ చీర అని అన్నారు,ఈ కార్యక్రమములో స్థానిక సర్పంచ్ పెంట వెంకట రమణ ఎంపీపీ సజన్ రాథోడ్ జడ్పీటీసీ అనిల్ జాధవ్ మండల కన్వీనర్ శివారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల బోజన్న కమల్ సింగ్ చంద్రశేఖర్ ఆడేళ్ళు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area