కేడీసీసీ బ్యాంక్ సేవలు వినియోగించుకోవాలి…
మేనేజర్ స్రవంతి..
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 23
రైతులకు మరిన్ని సేవలు అందించేందుకు, కే డి సి సి బ్యాంక్ నూతన కురవడిని ప్రవేశపెడుతూ కార్పొరేట్ బ్యాంకులకు ధీటుగా ముందుకు సాగుతుందని కేడీసీసీ బ్యాంక్ కేశవపట్నం మేనేజర్ స్రవంతి అన్నారు. శుక్రవారం మండలంలోని కేశవపట్నం గ్రామపంచాయతీ కార్యాలయంలో కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో రైతులకు ఖాతాదారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ స్రవంతి మాట్లాడుతూ. ప్రభుత్వ కార్పోరేట్ బ్యాంకులకు ధీటుగా కేడీసీసీ బ్యాంకు ఆధ్వర్యంలో రైతులకు ఖాతాదారులకు అనేక సేవలను అందిస్తుందని బ్యాంకు ఆధ్వర్యంలో ఫోన్ పే ,గూగుల్ పే కూడా కే డి సి సి సంస్థ ప్రవేశపెట్టిందని ప్రతి ఒక్కరు కేడిసిసి బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మెట్టుపల్లి ప్రాథమిక సహాయ సహకార సంఘం అధ్యక్షులు పొద్దుటూరి సంజీవరెడ్డి, ఉప సర్పంచ్ బోడ సంపత్, సంఘం పాలకవర్గ సభ్యులు, రైతులు, గ్రామస్తులు, ఖాతాదారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.