ఝరాసంగం మార్చి 6 (జనంసాక్షి) మండల కేంద్రంలో గల దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం లో ఆదివారం సాయంత్రం లింగాయత్ సమాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరిలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సిద్దేశ్వర్, మధు శేఖర్, మోర్గి బస్వరజ్, చంద్రశేఖర్, కోట గుండప్ప, చెల్మడ బస్వరజ్, శివరాజ్, కేతకి సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి తీర్త ప్రసాదాలు అందజేసి వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేతకీ ఆలయ ఛైర్మెన్ వెంకటేశం, మల్లికర్జున్ పాటిల్, శ్రీనివాస్ పాటిల్, నగేష్ సజ్జన్, ఆలయ పూజారులు దిలీప్ మహారాజ్, గుండప్ప పాల్గొన్నారు.
కేతకి లో పూజలు నిర్వహించిన లింగాయత్ సమాజ్ నాయకులు




