**కేతేపల్లి లో ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు*

 వనపర్తి సెప్టెంబర్ 26 (జనం సాక్షి)పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలో సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 127 వ జయంతిని ఘనంగా నిర్వహించారు గ్రామంలోని ఐలమ్మ విగ్రహానికి సిపిఐ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు డంగు కుర్మయ్య మాట్లాడుతూ ఐలమ్మ తెలంగాణ విముక్తి కోసం దున్నేవాడికి భూమికోసం పోరాడిందన్నారు ఆమె ఆశయాలను నెరవేర్చాలన్నారు సిపిఐ మాజీ మండల కార్యదర్శి శివకుమార్ గ్రామ శాఖ కార్యదర్శి ఆంజనేయులు సీనియర్ నాయకులు కురువ హనుమంతు మాల కుర్మయ్య చిన్న కురుమయ్య మద్దిలేటి రామాంజనేయులు మహిళా నాయకులు కురువమ్మ దేవమ్మ శంకరమ్మ రజక సంఘం నాయకులు భీమయ్య వెంకట్ స్వామి తదితరులు పాల్గొన్నారు