Friday, 6 November 2026

కేరళ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

చింతలపాలెం జనంసాక్షి

సూర్యాపేట జిల్లా,చింతలపాలెం మండలం, దొండపాడు గ్రామంలోని కేరళ ఉన్నత పాఠశాలలో దసరా పండుగను పురస్కరించుకొని ప్రభుత్వ ఆదేశానుసారం శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు,ఈ సంబరాలలో పిల్లలు బతుకమ్మలను తయారు చేసి ఆటలు పాటలతో అలరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మధిర సత్యనారాయణ రెడ్డి,ప్రిన్సిపాల్ అన్నపరెడ్డి పద్మజ మరియు ఉపాధ్యాయులు రవికుమార్,జాన్ థామస్, రామకోటేశ్వరరావు,భార్గవి,విజయకుమారి,శైలజ,ప్రభావతి,పి.భార్గవి,శిరీష,స్రవంతి,సింధు,శకుంతల మరియు తల్లిదండ్రులు పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేసినారు.