హైదరాబాద్,ఆగస్టు 21(జనం సాక్షి): కేరళ బాధితులను ప్రతిఒక్కరూ ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మాజీ మంత్రి, తెరాస నగర నేత దానం నాగేందర్ అన్నారు. పంజాగుట్ట ద్వారకాపురి కాలనీలోని శాంతిగిరి ఆయుర్వేద సిద్ధ ఆసుపత్రి(శాంతిగిరి ఆశ్రమం) వారి సౌజన్యంతో ఎనిమిది టన్నుల బియ్యం, నిత్యావసర సరకులు, నూతన వస్త్రాలు, మందులు తదితరాలతో కేరళకు వెళ్లే లారీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాంతిగిరి ఆశ్రమానికి చెందిన ప్రణవ సూదన జ్ఞాన తపస్వి, మాజీ వార్డు కౌన్సిల్ సభ్యులు గోపికా రాజేశ్వర్, సంస్థ జీఎం ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.




