కేవోసి ప్రాజెక్ట్ కార్యాలయం ముందు ధర్నా

–3వ రోజు సమ్మె లో కార్మికులు -జెఏసీ

టేకులపల్లి, సెప్టెంబర్ 11( జనం సాక్షి ): సింగరేణి యాజమాన్యం దిగిరావాలని జెఏసి నాయకులు ఆధ్వర్యంలో ఆదివారం మూడో రోజు సమ్మెలో భాగంగా సమ్మెను ఉధృతం చేస్తూ డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో జేఏసీ నాయకులు డి ప్రసాద్, రేపాకుల శ్రీనివాస్, కోటిలింగం, వీరన్న లు మాట్లాడుతూ న్యాయపరమైన కార్మికుల డిమాండ్లను సింగరేణి యాజమాన్యం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో భాగంగ కోయగూడెం ఓసీ ప్రాజెక్ట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సమ్మెలో ఈసం నరసింహారావు, కడుగుల వీరన్న, కుంజ రమేష్, ప్రేమ్ కుమార్, నవీన్ ,రవీందర్, మధు ,సతీష్ తదితరులు పాల్గొన్నారు.