Wednesday, 4 November 2026

కేసీఆర్‌ పాలనలో మాదిగలకు ఒరిగింది ఏమిలేదు: మందకృష్ణ

నిర్మల్‌/ఆర్మూర్‌, ఫిబ్రవరి 24 (జ‌నంసాక్షి) : కేసీఆర్‌ పాలనలో మాదిగలకు ఒరిగింది ఏమి లేదని ఎమ్మార్పీఎస్‌ నేత మంద కృష్ణమాదిగ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి వర్గంలో ఎందరో అవినీతి మంత్రులు ఉన్నా రాజయ్యపైనే వేటు వేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాదిగలను చిన్నచూపు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ తీర్మానం చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. జలయజ్ఞం కాంట్రాక్టర్ల వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముడుపులు తీసుకున్నారని నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో మందకృష్ణ మాదిగ ఆరోపించారు మార్చి 18వ తేదీన రెండు రాష్ట్రాల అసెంబ్లీలను ముట్టడించనున్నట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. మార్చి 3వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కరీంనగర్‌ పర్యటన సందర్భంగా అదే రోజు తాము మాదిగల గర్జన పేరిట పోటీ సభను నిర్వహిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *