Monday, 2 November 2026

కేసీఆర్‌ పాలన.. నవాబు పాలనను తలపిస్తుంది

– పలు పత్రికలు, ఛానెల్స్‌ సిద్ధాంతాలను విస్మరిస్తున్నాయి
– వీటిపై నిషేధం విధించాలని ఈసీకి ఫిర్యాదు చేశా
– ఈసీ చర్యలు తీసుకోకుంటే న్యాయస్థానంకు వెళ్తా
– డీజీపీ, ఇంటలిజెన్స్‌ డీఐజీలు కేసీఆర్‌కు ప్రైవేట్‌ సైన్యంగా మారారు
– అందరినీ గుర్తుపెట్టుకుంటాం..
– మేం అధికారంలోకి రాగానే గుణపాఠం తప్పదు
– విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌నేత రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌, అక్టోబర్‌31(జ‌నంసాక్షి) :  నిజాం నవాబు పాలనను కేసీఆర్‌ పాలన తలపిస్తుంని టీకాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్‌ను రేవంత్‌రెడ్డి కలిశారు. భద్రత పెంపునకు సంబంధించిన హైకోర్టు తీర్పు కాపీని రేవంత్‌రెడ్డి సీఈవోకు అందజేశారు. ఇటీవల రేవంత్‌రెడ్డికి 4 ప్లస్‌ 4 గన్‌మెన్స్‌, ఎస్కార్ట్‌ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. టీఆర్‌ఎస్‌ పార్టీ విూడియా సంస్థలపై ఫిర్యాదు చేశామని రేవంత్‌ అన్నారు. కాంగ్రెస్‌ పై పలు
ఛానెల్స్‌ బురద జల్లుతున్నారు.. మా ప్రచారం గురించి చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచార ప్రసార సాధనలు అనే ¬దా తీసేసి, నిషేధం విధించాలని కోరాం అని తెలిపారు. పింక్‌ బ్యాలెట్‌ పత్రాలను కూడా మార్చాలని సీఈఓకు ఫిర్యాదు చేశామన్నారు. పత్రికలు విలువలను, సిద్ధాంతాలను విస్మరిస్తున్నాయన్నారు. ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోకపోతే మేము న్యాయస్థానం తలుపు తడతామని అయన తెలిపారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఇంటలిజెన్స్‌ డీఐజీ ప్రభాకర్‌ రావు మరికొందరు కేసీఆర్‌ కు ప్రైవేటు సైన్యంగా పని చేస్తూన్నారన్నారు. డిసెంబర్‌ 13న కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపడుతుందని, కాంగ్రెస్‌ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టిన అధికారుల కోసం ప్రత్యేక డైరీ పెట్టామని రేవంత్‌ హెచ్చరించారు. వీళ్ళు చేసే పనులన్నీ అందులో పొందుపరిచి తగిన గుణపాఠం చెబుతాం అని రేవంత్‌ రెడ్డి అన్నారు. గతంలో డీజీపీగా ఉన్న యాదవ్‌ ను మార్చి మహంతిని డీజీపీగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన విషయాన్ని డీజీపీ మహేందర్‌ రెడ్డి గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ అధికార నివాసాన్ని రాజ్యాంగేతర శక్తులు దుర్వినియోగం చేస్తున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నేతలపై ఐటీ అధికారులు నిఘా పెట్టాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే కేటీఆర్‌ కు సిగ్గనిపించలేదా అని మండిపడ్డారు. ఆంధ్రవాళ్ళు చెడ్డవాళ్ళు అయితే వెళ్లి అక్కడ వాళ్ళ కడుపులో తల పెట్టాల్సిన అవసరం లేదన్నారు. రెండు ప్రభుత్వాలు వేరు అనుకుంటే ఆంధ్ర ప్రభుత్వం ముందు మొకరిల్లాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రానికి దరిద్రం పట్టిందని, తప్పుడు విధానాలకు కేసీఆర్‌ బీజం వేస్తున్నారు అని రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. తీరు మార్చుకోకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారని రేవంత్‌ హెచ్చరించారు.